: భారత ఐటీ కంపెనీలకు ఊరట... ముగిసిన హెచ్-1బి వీసాల అదనపు రుసుం నిబంధన


హెచ్-1బి వీసాలకు అదనపు రుసుం విషయంలో భారత ఐటీ కంపెనీలకు ఊరట లభించింది. ఈ వీసాలపై ఇంతవరకూ చెల్లిస్తూ వస్తున్న అదనపు 2వేల డాలర్ల రుసుం నిబంధన గడువు చెల్లిపోయింది. పొరుగుసేవల రుసుంగా పిలిచే దాని కారణంగా కొన్ని సంవత్సరాలుగా భారత ఐటీ సంస్థలు లక్షల కొద్ది డాలర్లు చెల్లించాయి. 2010లో అమల్లోకి తెచ్చిన ఈ ఔట్ సోర్సింగ్ రుసుము ప్రకారం, అమెరికా కార్యాలయాల్లో 50 శాతం కంటే అధికంగా విదేశీ సిబ్బంది పనిచేస్తున్న పక్షంలో ఐటీ కంపెనీలు ఒక్కో విదేశీ ఉద్యోగిపై హెచ్ 1బీ ఫీజు కింద 2వేల డాలర్లు చెల్లించాల్సి వచ్చేది.

  • Loading...

More Telugu News