: జ్యువెలర్స్ ఓనర్ నోట్లో యాసిడ్ పోసిన దుండగులు... అనంతరం నగలతో పరార్
హైదరాబాదులోని నేరెడ్ మెట్ లో దోపిడీ దొంగలు దారుణానికి ఒడిగట్టారు. నగల దుకాణంలో చోరీ కోసం వచ్చిన దొంగలు దుకాణం యజమాని నోట్లో యాసిడ్ పోశారు. దీంతో యజమాని బాధతో గిలగిల కొట్టుకుంటుండగానే చేతికందిన నగలతో దొంగలు ఉడాయించారు. వివరాల్లోకెళితే... నేరెడ్ మెంట్ పరిధిలో శ్రీ సాయిబాలాజీ జ్యువెల్లర్స్ పేరిట దుకాణం ఏర్పాటు చేసుకున్న మోహన్ అనే వ్యక్తి నగల వ్యాపారం చేస్తున్నాడు. నేటి ఉదయం చోరీ కోసం దుకాణంలోకి చొరబడ్డ దొంగలు మోహన్ నోట్లో యాసిడ్ పోశారు. ఆ తర్వాత దుకాణంలోని నగలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు మోహన్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మోహన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.