: అంపైర్ల నిర్ణయాలే కొంపముంచాయి... ధర్మశాల ఓటమిపై ధోనీ కామెంట్


ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో సఫారీ చేతిలో ఎదురైన ఓటమికి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వివరణ ఇచ్చాడు. అంపైర్లు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లే తమకు ఓటమి ప్రాప్తించిందని అతడు పేర్కొన్నాడు. 34 బంతుల్లో 68 పరుగులు చేసి భారత్ విజయంపై సఫారీ ఆల్ రౌండర్ జేపీ డుమిని నీళ్లు చల్లాడు. డుమిని వీరోచిత బ్యాటింగ్ కారణంగానే తాము ఓటమిపాలయ్యామని ధోనీ కూడా ఒప్పుకున్నాడు. అయితే జేపీ డుమిని రెండు సార్లు వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడట. కానీ అంపైర్లు మాత్రం తమ అప్పీళ్లకు సానుకూలంగా స్పందించలేదని ధోనీ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు సార్లు లైఫ్ దక్కిన డుమిని ఆ తర్వాత వీర విహారం చేశాడని అతడు పేర్కొన్నాడు. వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయిన డుమిని ఔట్ అయినట్లు అంపైర్లు ప్రకటించి ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేదని ధోనీ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News