: గూగుల్ మ్యాపింగ్ లో రైతు పొలాన్ని చూపించే స్థాయికి చేరుకోవాలి: చంద్రబాబు


గూగుల్ మ్యాపింగ్ లో ప్రతి ఇంటినీ చూపిస్తున్నారని, అలాగే రైతు పొలాన్ని చూపించే స్థాయికి చేరుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి 'మీ ఇంటికి- మీభూమి' పథకంపై సీఎం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సహకారంతో ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తొలివిడతలో 54 శాతం ఫిర్యాదులు పరిష్కరించిన అధికారులు అక్టోబర్ 15లోపు వంద శాతం ఫిర్యాదులు పరిష్కరించాలని గడువు విధించారు. వీఆర్వోలకు ఇచ్చిన ట్యాబ్ ల ద్వారా వెడ్ అడంగళ్ లో రెవెన్యూ భూముల వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అనంతపురం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాలు ముందున్నాయని తెలిపారు. అన్ని జిల్లాలో వంద శాతం ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

  • Loading...

More Telugu News