: ‘మ్యాగీ’ ఇక కనుమరుగే... రంగప్రవేశం చేస్తున్న ‘పతంజలి’ నూడుల్స్


ఇక మన పిల్లలు ‘మ్యాగీ’ నూడుల్స్ మాటెత్తరు. ఎందుకంటే, మార్కెట్లో మ్యాగీ ప్యాకెట్లు కనిపించే పరిస్థితి లేదు. ప్రమాదకర రసాయనాలున్నాయన్న కారణంగా బహుళ జాతి సంస్థ ‘నెస్లే’ తయారు చేస్తున్న మ్యాగీ నూడుల్స్ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. నెలల తరబడి ప్రయోగ శాలల్లో జరిగిన పరీక్షల్లో రసాయనాలున్న మాట వాస్తవమేనని తేలింది. ఈ నేపథ్యంలో మార్కెట్లోని మ్యాగీ స్టాకునంతటిని వెనక్కు తీసుకున్న నెస్లే, ఆ తర్వాత రసాయనాలు లేని మ్యాగీ అంటూ మళ్లీ మర్కెట్లోకి వచ్చింది. అయితే అప్పటికే మ్యాగీపై జరిగిన రాద్ధాంతంతో విక్రయాలు ఆశించినంతగా లేవట. అదే సమయంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని ‘పతంజలి యోగా కేంద్రం’ కొత్తగా ‘పతంజలి’ బ్రాండ్ తో నూడుల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నూడుల్స్ ఉత్పత్తిని ప్రారంభించిన పతంజలి యోగా కేంద్రం త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంతేకాదు, మ్యాగీ నూడుల్స్ ధరలో సగం ధరకే పతంజలి నూడుల్స్ లభిస్తాయట. దీంతో భారతీయ మార్కెట్ నుంచి ‘మ్యాగీ’ బ్రాండ్ ఔటవడం ఖాయమే.

  • Loading...

More Telugu News