: చంచల్ గూడ ఖైదీలను అలరించిన హాస్యనటుడు అలీ


ఎలాంటి వినోదానికి నోచుకోని చంచల్ గూడ జైలు ఖైదీలను సినీ హాస్యనటుడు అలీ తనదైన శైలి వినోదంతో అలరించారు. తన హాస్యోక్తులతో కడుపుబ్బా నవ్వించారు. మామూలుగా ప్రతి సంవత్సరం గాంధీ జయంతి రోజున ఖైదీల సంక్షేమ దినోత్సవం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా జైలు అధికారులు సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి ఖైదీలతో మాట్లాడిస్తుంటారు. ఈసారి నటుడు అలీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖైదీలందరితో పాటు ముఖ్య అతిథిగా హైదరాబాద్ కలెక్టర్ బొజ్జా రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీఐజీ నర్సింహ మాట్లాడుతూ, ఓ ఖైదీని దత్తత తీసుకోవాలని అలీని కోరారు. అందుకు వెంటనే స్పందించిన అలీ, నలుగురు మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఇందుకు జైలు అధికారులు, ఖైదీలు చాలా సంతోషించారు.

  • Loading...

More Telugu News