: కరుణానిధి ‘కథా’ చోరుడే!... తన స్క్రిప్ట్ ను తస్కరించారంటున్న తమిళ రచయిత
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాజకీయ నేతగానే కాక సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కథా రచయిత అన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతి సంగతేమో కాని, అంతకుముందు మాత్రం ఆయన చోర శిఖామణుడట. ఈ మేరకు తమిళ సినీ రచయిత ముత్తుసామి తాజాగా కరుణానిధిపై సంచలన ఆరోపణ చేశారు. 1949లో తమిళంలో విడుదలైన ‘మరుదనాట్టు ఇళవరసి’ చిత్రం కరుణానిధి అందించిన కథతోనే తెరకెక్కిందట. అయితే ఆ కథను రాసింది మాత్రం ఆయన కాదట. ఈ సినిమా కథతో పాటు స్క్రిప్టు కూడా తనదేనని ముత్తుసామి ఆరోపిస్తున్నారు. కథతో పాటు స్క్రిప్టును కరుణానిధికి ఇస్తే, తనకు తెలియకుండానే ఆయన సినిమా తీసేశారని ముత్తుసామి ఆరోపిస్తున్నారు.