: టీడీపీ ఎంపీకి షాకిచ్చిన క్లోనింగ్ ముఠా... ఖాతా నుంచి రూ.50 వేల నగదు డ్రా


టీడీపీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నరసింహానికి ఏటీఎం, క్రెడిట్ కార్డుల క్లోనింగ్ ముఠా షాకిచ్చింది. తోట నరసింహం పేరిట జారీ అయిన బ్యాంకు డెబిట్ కార్డును క్లోనింగ్ చేసి నకిలీ కార్డును తయారు చేసిన దుండగులు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా చేశారు. తన డెబిట్ కార్డు తన వద్దే ఉన్నా, బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు మాయమవ్వడంపై అనుమానం వచ్చిన తోట నరసింహం వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కాకినాడ పోలీసులు ఎంపీ ఖాతా నుంచి మాయమైన నగదు గోవాలోని ఏటీఎం నుంచి డ్రా అయినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు సేకరించిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News