: సినీ నటుల ఇళ్లల్లో రూ.100 కోట్లు?... కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు


మూడు రోజుల క్రితం తమిళ హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార, మరికొంత మంది నిర్మాతల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఏకంగా రూ.100 కోట్ల విలువైన ఆస్తులు వెలుగు చూశాయట. ఈ మేరకు రెండు రోజుల పాటు వరుస తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు సదరు ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. చెన్నైలోని విజయ్ కి చెందిన రెండు ఇళ్లు, అతడి తాజా చిత్రం ‘పులి’ దర్శకుడు సింబుదేవన్ ఇల్లు, చిత్ర నిర్మాతల్లో ఒకరైన పీటి సెల్వకుమార్ ఇల్లు, నయనతారకు చెందిన మూడు ఇళ్లు, హైదరాబాదులోని సమంత ఇంటిలో జరిపిన సోదాల్లో ఈ ఆస్తులు లభ్యమైనట్లు సమాచారం. ఈ ఆస్తులకు సంబంధించి సదరు నటులు, సినీ ప్రముఖులు పన్ను చెల్లించారా? లేదా? అన్న కోణంలో ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News