: ముసలమ్మకు చంద్రబాబు ఆపన్నహస్తం...క్షణాల్లో పింఛన్, రూ.25 వేల ఆర్థిక సాయం


పరిపాలనలో కాస్తంత కఠినంగా వ్యవహరిస్తారని పేరున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిలో ఇటీవల దానగుణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల తనకు ఎదురుపడ్డ ఓ వృద్ధురాలికి జేబులోని నగదు తీసిచ్చిన చంద్రబాబు నిన్న మరో ముసలమ్మకు బతుకుపై భరోసా కల్పించారు. వివరాల్లోకెళితే... గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన వై.కమలమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తోంది. ఇటీవల ఎన్ఎస్ఎస్ వలంటీరుగా పనిచేస్తున్న జేకేసీ కళాశాల విద్యార్ధి కోటేశ్వరి ఇంటింటి సర్వే చేస్తున్న సమయంలో కమలమ్మ గురించి పూర్తి వివరాలు సేకరించింది. అనాథనైన తనకు గతంలో నెలకు రూ.200 పింఛన్ వస్తుండగా, ప్రస్తుతం పింఛన్ నిలిచిపోయిందని కమలమ్మ తన ఆవేదనను కోటేశ్వరికి తెలిపింది. కమలమ్మ ధీనగాథను కోటేశ్వరి నేరుగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో నిన్న గుంటూరులో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కోసం వచ్చిన చంద్రబాబు కమలమ్మకు అక్కడికక్కడే పింఛన్ మంజూరు చేయించడంతో పాటు రూ.25 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

  • Loading...

More Telugu News