: వియ్యంకులవుతున్న ఏపీ మంత్రులు
ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను పర్యవేక్షిస్తున్న ఇద్దరు మంత్రులు త్వరలో వియ్యంకులు కానున్నారు. మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నారాయణ రెండో కూతురు శరణి వివాహం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజతో ఈ నెల 30న జరగనుంది. ఈ వివాహంతో ఇప్పటిదాకా కేబినెట్ సహచరులుగా ఉన్న గంటా, నారాయణలు వియ్యంకులుగా మారనున్నారు. 30న నెల్లూరులో ఈ వివాహ వేడుకను మంత్రి నారాయణ కుటుంబం అంగరంగవైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల 4న విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మంత్రి గంటా భారీ రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు.