: బీహార్ లో మాటల తూటాలు...'గాంధీ హంతకుడికి వారసుడు మోదీ' అంటూ లాలూ పరోక్ష వ్యాఖ్యలు


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, జేడీయూ కూటమిల మధ్య పరస్పర ఆరోపణలు హద్దులు దాటుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను నరభక్షకుడంటూ విరుచుకుపడ్డ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, గాంధీ జయంతి రోజైన నిన్న ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ హంతకుడు మోదీ అన్న భావం వచ్చేలా లాలూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ మేరకు నిన్న ఆయన ట్విట్టర్ లో మోదీపై శివాలెత్తిపోయారు. ‘‘గాంధీజీ హంతకుడు గాడ్సేకి అనుచరులు ఎవరు?... ఆరెస్సెస్. ఆరెస్సెస్ కు అనుచరులు ఎవరు?... బీజేపీ. బీజేపీని నడిపిస్తున్నదెవరు? మోదీనేగా!’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News