: టీమిండియా బౌలర్లను భయపెట్టిన డివిలియర్స్...సౌతాఫ్రికా 104/3
టీమిండియా బౌలర్లను డివియర్స్ భయపెట్టాడు. 200 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హషీమ్ ఆమ్లా (36), డివిలియర్స్ (51) ధాటిగా బ్యాటింగ్ చేశారు. కేవలం 32 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్సర్ సాయంతో డివిలియర్స్ అర్ధసెంచరీ చేశాడు. వారి భాగస్వామ్యం విడదీసేందుకు ధోనీ బౌలర్లందరినీ వినియోగించాడు. వీరు ధాటిగా ఆడడంతో పది ఓవర్లలో సౌతాఫ్రికా 90 పరుగులు చేసింది. ఆమ్లా రనౌట్ గా వెనుదిరగడంతో రంగ ప్రవేశం చేసిన అశ్విన్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ డివిలియర్స్ ను పెవిలియన్ బాటపట్టించాడు. కాసేపట్లోనే అరవింద్ సఫారీల కెప్టెన్ డుప్లెసిస్ (4) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, అరవింద్ చెరో వికెట్ తీసి రాణించారు.