: పిడుగుపడి తల్లీకొడుకుల మృతి
పిడుగుపడి తల్లీకొడుకులు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎడవల్లి మండలం కుర్నావల్లి గ్రామ శివారులో జరిగిన ఈ సంఘటన వివరాలు. లక్ష్మీ(45) తన కుమారుడు రజనీకాంత్ (20)తో కలిసి పొలం పనులకని వెళ్ళింది. పొలంలో కలుపుతీస్తుండగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దీంతో పొలం పనులు ఆపి, తల్లీ కొడుకులిద్దరూ సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో తల్లీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.