: చిన్నప్పుడన్న మాట రామ్ చరణ్ ఇప్పుడు నిజం చేశాడు: సాయి ధరమ్ తేజ్
చిన్నప్పుడు రామ్ చరణ్ నాన్ చాక్ తిప్పుతుండడం చూసి 'అమ్మా! చరణ్ బ్రూస్ లీలా నాన్ చాక్ తిప్పుతున్నాడ'ని చెప్పానని మెగా ఫ్యామిలీ లేటెస్ట్ హీరో సాయి ధరమ్ తేజ్ గతం గుర్తు చేసుకున్నాడు. నోవాటెల్ లో జరిగిన 'బ్రూస్ లీ ద ఫైటర్' సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తానెప్పుడో అన్న మాటలు నిజం చేస్తూ, బ్రూస్ లీ పేరుతో సినిమా చేసినందుకు అభినందించాడు. చరణ్ నటించడాన్ని, డాన్సులు చేయడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తానని ధరమ్ తేజ్ తెలిపాడు. సినిమా బాగుంటుందని తనకు ముందే తెలుసని ధరమ్ తేజ్ అన్నాడు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు.