: వాళ్లిద్దరి గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది: అల్లు అరవింద్


చిరంజీవితో 151వ సినిమా చేస్తానని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. నోవాటెల్ లో జరిగిన 'బ్రూస్ లీ ద ఫైటర్' సినిమా ఆడియో వేడుకలో మాట్లాడుతూ, బహిరంగ వేదికలపై అల్లు అర్జున్, రామ్ చరణ్ గురించి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. అయినప్పటికీ దర్శకుడు శ్రీను వైట్లతో మాట్లాడానని, అద్భుతంగా వచ్చిందని చెప్పాడని అన్నాడు. చిరంజీవి, రామ్ చరణ్ లిద్దరూ గీతా ఆర్ట్స్ కి మగధీరుల్లాంటి వారని, వారితో తమ సంస్థ ఎప్పుడూ సినిమాలు నిర్మిస్తూనే ఉంటుందని అల్లు అరవింద్ తెలిపారు. చిరంజీవి డేట్స్ ఇస్తే రేపటి నుంచే షూటింగ్ మొదలు పెడతానని అల్లు అరవింద్ చెప్పారు.

  • Loading...

More Telugu News