: రోహిత్ అర్ధసెంచరీ ...టీమిండియా 86/1


టీమిండియా ధాటిగా ఆడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ (56) సఫారీలపై విరుచుకుపడ్డాడు. దీంతో తొలి పది ఓవర్లలోనే సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ప్రధాన బౌలర్లందరినీ ప్రయోగించాడు. అయినా ఫలితం లేకపోయింది. ఆదిలోనే శిఖర్ ధావన్ (3) వికెట్ కోల్పోవడంతో కాస్త జాగ్రత్తగా ఆడిన రోహిత్ కు రెండు లైఫ్ లు వచ్చాయి. తొలి ఓవర్ లోనే ఎల్బీడబ్ల్యూ ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ ఆరో ఓవర్ లో బౌలర్ కే క్యాచ్ ఇవ్వబోయాడు. బౌలర్ ఒక్క సెకెన్ ఆలస్యంగా స్పందించడంతో రోహిత్ బతికిపోయాడు. లభించిన లైఫ్ లతో రోహిత్ శివాలెత్తాడు. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో భారత జట్టు పది ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయి 86 పరుగులు చేసింది. క్రీజులో రో్హిత్ (56), కోహ్లీ (20) వున్నారు. మరో పది ఓవర్లు మిగిలి ఉండగా, చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. దీంతో భారీ స్కోరు దిశగా టీమిండియా సాగుతోంది.

  • Loading...

More Telugu News