: ధావన్ ఔట్... టీమిండియా 22/1


భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ (3) రనౌట్ గా వెనుదిరిగాడు. టాస్ ఓడిన టీమిండియా, ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ (18) కేవలం ఫోర్లతోనే స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. అద్భుతమైన ప్లేస్ మెంట్, టైమింగ్ తో రోహిత్ బంతిని బౌండరీ తరలిస్తున్నాడు. రబదా వేసిన నాలుగో ఓవర్ తోలి బంతిని లాంగ్ ఆన్ మీదుగా కొట్టిన ధావన్ తొలి రన్ తీశాడు. ఇంతలో రోహిత్ శర్మ రెండో రన్ కు దూసుకురావడంతో ధావన్ కాస్త ఆలస్యంగా స్పందించి రన్ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 26 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (18), విరాట్ కోహ్లీ (3) వున్నారు.

  • Loading...

More Telugu News