: నేను, హరీష్ ఒక్క విషయంలోనే పోటీపడతాం: మంత్రి కేటీఆర్
‘నేను, హరీష్ రావు పోటీ పడేది కేవలం నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో మాత్రమే’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరోగ్యకరమైన పోటీ ఉండటంలో ఎటువంటి తప్పు లేదన్నారు. తనకు, మంత్రి హరీష్ కు మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. రాజకీయాల్లో మాత్రం తమ మధ్య ఎటువంటి పోటీలేదని ఆయన స్పష్టం చేశారు. తామిద్దరం కూడా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నామని, భవిష్యత్ లో కూడా పనిచేస్తామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాగా, వాటర్ గ్రిడ్ పై వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని కేటీఆర్ కొట్టిపారేశారు. వరంగల్ లో జరిగిన ఎన్ కౌంటర్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పోలీసుల విధి నిర్వహణలో భాగంగానే వరంగల్ ఎన్ కౌంటర్ జరిగిందని కేటీఆర్ అన్నారు.