: 25 దేవాలయాల్లో ఖైరతాబాద్ గణేశ్ లడ్డూ ప్రసాదం పంపిణీ
హైదరాబాద్ లోని 25 దేవాలయాల్లో ఖైరతాబాద్ గణేష్ లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ గణేష్ దేవాలయం, బిర్లామందిర్, జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్, శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ తదితర దేవాలయాల్లో లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ రోజు ఉదయం లడ్డూ ప్రసాదం పంపిణీలో తీవ్ర గందరగోళం జరిగింది. తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.