: అబద్ధాలు ఎక్కువగా ఆడేది వాళ్లేనట!
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఒక విషయం మాత్రం వాస్తవం. అదేమిటంటే... ప్రతి ఒక్కరి జీవితంలో అబద్ధం అనేది తప్పనిసరనేది. అసలు, అబద్ధాల గురించి మనమెందుకు మాట్లాడుకుంటున్నామంటే... ధనవంతుల మనస్తత్వాలపై కూలంకంషంగా పరిశోధన చేశారు అమెరికన్ శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనను కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన మానసిక శాస్త్రవేత్తలు, టొరంటో యూనివర్శిటీ, బర్కిలీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేశారు. సామాన్యులతో పోలిస్తే ధనవంతులకు అబద్ధాలాడటం వెన్నతో పెట్టిన విద్యట. అదీ కూడా తమకు ప్రయోజనం కల్గుతుందనుకుంటే ధనవంతులు అబద్ధాలాడటానికి అస్సలు వెనుకడుగు వేయరట. ఆ పరిశోధనలో ఇంకో విషయం కూడా తెలిసింది.. ధనవంతులకు స్వార్థం, దురాశ కూడా కాస్త ఎక్కువేనని!