: ఐఎస్ఐఎస్ పై తొలిసారి దాడి చేసిన రష్యా
సిరియా, ఇరాక్ లలో హింసాత్మక దాడులకు పాల్పడుతూ, నరమేధం సృష్టిస్తున్న ఐఎస్ఎస్ పై రష్యా మొదటిసారి దాడులకు పాల్పడింది. సిరియాలో వైమానిక దాడులతో రష్యా సైన్యం విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది హతమైనట్టు అధికారులు తెలిపారు. సిరియాలోని రఖా నగరం పశ్చిమ ప్రాంతంలో ఉన్న తబ్ఖా విమానాశ్రయం సమీపంలో ఉన్న ఐఎస్ స్థావరాలపై రష్యా బలగాలు దాడులు జరిపాయి. ఐఎస్ ఉగ్రవాదులపై దాడులు చేయాలన్న నిర్ణయానికి ఇటీవలే రష్యా పార్లమెంటు ఆమోదం పలికింది. ఈ క్రమంలోనే దాడులు ప్రారంభమయ్యాయి.