: వార్సా వీధుల్లో కత్తితో యథేచ్ఛగా తిరుగుతున్న 'నింజా'


పోలాండ్ లోని వార్సా రోడ్లపై సూపర్ హీరో నింజా తిరుగుతున్నాడు. మధ్యయుగం నాటి జపాన్ కిరాయి హంతకులను నింజాలుగా పిలుచుకునేవారు. విభిన్నమైన ఆయుధ ప్రయోగం, క్లిష్ట పరిస్థితులను అధిగమించడం, ఆయుధాలు లేకుండా శత్రువులను మట్టుబెట్టడంలో కఠినమైన శిక్షణ అనంతరం నింజాగా మారేవారు. ఒక నింజాను మరో నింజా మాత్రమే చంపగలడని జపాన్ లో నమ్ముతారు. జపాన్ ఏకీకరణ తరువాత నింజాలు అంతరించిపోయారు. హాలీవుడ్ లో నింజా సినిమాలు ఎన్నో వచ్చాయి. ఈ నింజాలు ధరించే వస్త్రధారణతో వార్సాలో తిరుగుతూ ఓ వ్యక్తి స్థానికుల్లో ఆందోళన రేపాడు. దీంతో పలువురు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, తాము కూడా అతనిని చూశామని తెలిపారు. అతను తమకు బాగా తెలిసిన వ్యక్తేనని, అతని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని వారు తెలిపారు. అలాంటప్పుడు అతనిని ఇబ్బంది పెట్టలేమని వారు వివరించారు. ఇప్పుడతని ఫోటోను నింజా సూడో సూపర్ హీరో అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అతనిని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తన వస్త్రధారణపై సెజరీ (నింజా) మాట్లాడుతూ, టీనేజ్ లో ఉండగా కొందరు తనతో ఘర్షణకు దిగారని, వారితో ముష్టి యుద్ధం చేయాల్సి వచ్చిందని, అప్పుడే నింజా తరహా డ్రెస్ ఉంటే కత్తి ఉంటుందని, అలాంటి వారిని ఎదుర్కోవచ్చని భావించానని, అప్పటి నుంచి తాను కత్తి కొనుక్కుని నింజా తరహా దుస్తులు వేసుకుంటున్నానని చెప్పాడు. మనం ఎవరికీ హాని చేయనప్పుడు, మన వల్ల ఎవరికీ ఇబ్బంది లేనప్పుడు నచ్చిన విధంగా జీవించే హక్కు మనకు ఉందని ఈ నయా నింజా తెలిపాడు.

  • Loading...

More Telugu News