: ఇలియానా హాలీవుడ్ సినిమాలో నటిస్తోందట!
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్ లో సెటిలైన ఇలియానా డిక్రూజ్ హాలీవుడ్ సినిమాలో నటిస్తోందా? అంటే బాలీవుడ్ లో అవుననే అంటున్నారు. 'హ్యాపీ ఎండింగ్' సినిమా తరువాత ఇలియానా బాలీవుడ్ సినిమాల్లో కనిపించలేదు. ఆ మధ్య ప్రేమ, సహజీవనం వంటి విషయాలపై వివాదాస్పద కామెంట్లతో 'టాక్ ఆఫ్ ది బాలీవుడ్' అయిన ఇలియానా హాలీవుడ్ సినిమాలో నటిస్తోందని బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. మార్షల్ ఆర్ట్స్ వీరుడు జాకీ చాన్, నటుడు సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'కుంగ్ ఫూ యోగా' లో ఇలియానా జాకీ చాన్ సరసన నటించనుందని, అతనితో యాక్షన్ సీన్స్ లో కూడా పాల్గోనుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా, 'కుంగ్ ఫూ యోగా' షూటింగ్ ఇండియా, బార్సిలోనా, దుబాయ్, బీజింగ్ లలో జరగనుంది. ఇలియానా పాత్రపై సినిమా యూనిట్ కానీ, ఇల్లీ బేబీ కానీ స్పందిస్తే తప్ప వాస్తవం తెలియదు. కాగా, జాకీ చాన్ గత సినిమాలో మల్లికా శెరావత్ నటించిన సంగతి తెలిసిందే.