: లెజెండరీ క్రికెటర్ తో కలసి వేదిక పంచుకున్న రామ్ చరణ్
టీమిండియా మాజీ కెప్టెన్, ఆల్ టైం గ్రేట్ కపిల్ దేవ్ తో కలసి టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ వేదిక పంచుకున్నాడు. హైదరాబాదులో జరిగిన 'ఖుషి' చారిటబుల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. అనంతరం రామ్ చరణ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కపిల్ దేవ్ తో వేదిక పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. అంతేకాదు, కపిల్ తో కలసి దిగిన ఫొటోను కూడా అప్ లోడ్ చేశాడు.