: నేటి మ్యాచ్ లో టాస్ కు ప్రత్యేక కాయిన్
ధర్మశాల వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ లో తొలి మ్యాచ్ లో టాస్ కు ప్రత్యేక కాయిన్ ను వినియోగించనున్నారు. 20 గ్రాముల బరువున్న ఈ కాయిన్ కు వెండిపూత పూశారు. ఈ నాణేనికి ఒకవైపు మహాత్మాగాంధీ, మండేలా బొమ్మలు ముద్రించగా, రెండో (బొరుసు) వైపు భారత్, సిరీస్ లోగో ముద్రించారు. నేటి సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, మ్యాచ్ ముందు టీమిండియా కెప్టెన్ ధోనీ, సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తో కలిసి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కాయిన్ ను ఆవిష్కరించనున్నారు. అనంతరం టాస్ వేస్తారు. ఈ సిరీస్ మొత్తం ఇదే కాయిన్ తో టాస్ వేస్తారు. గాంధీ, మండేలా గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.