: గుంటూరు జిల్లాలో బాలికపై కుక్కల దాడి
వీధి కుక్కల స్వైరవిహారం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో, తెలంగాణ లోని వరంగల్, మరికొన్ని జిల్లాల్లో వీధికుక్కలు రెచ్చిపోయిన సంఘటనలలో పలువురు గాయపడి ఆసుపత్రులలో చేరారు. తాజాగా, గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఒక బాలికపై వీధికుక్కలు దాడి చేశాయి. సీతారాంపురంలో పదేళ్ల బాలికపై కుక్కలు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో పొన్నూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి బాలికను తరలించారు. వైద్య సేవలు కొనసాగుతున్నాయి.