: స్వచ్ఛభారత్ పాటలు పాడితే వీధులు శుభ్రం కావు: మోదీపై కేజ్రీ విమర్శలు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా, దానిక అవసరమైన కార్యాచరణ ఉండాలని చెప్పారు. స్వచ్ఛభారత్ అంటూ పాటలు పాడుకుంటూ ఉంటే వీధులు శుభ్రం కావని ఎద్దేవా చేశారు. ఏడాదికి ఒకసారి ఫొటోలకు పోజులిస్తూ రోడ్లు ఊడిస్తే స్వచ్ఛభారత్ కల సాకారం కాదని విమర్శించారు. ఢిల్లీలో తాము కొత్తగా 350 పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించామని చెప్పారు.