: చేతనైతే బీఫ్ ఎగుమతులను నిషేధించండి: కేంద్రానికి అఖిలేష్ సవాల్


ఆవు మాంసాన్ని భుజించి, ఇంట్లో పెట్టుకున్నారన్న కారణంతో ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో 50 ఏళ్ల మొహమ్మద్ ను కొంత మంది వ్యక్తులు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ నేడు లక్నోలో స్పందించారు. చేతనైతే బీఫ్ ఎగుమతులను నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మన దేశాన్ని విదేశాల్లో మార్కెట్ చేయడానికి వివిధ దేశాల్లో తిరుగుతున్న వారు... అక్కడి ప్రజలు ఏం తింటున్నారో గమనించాలని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారతదేశ రాజ్యాంగం సెక్యులరిజంపై నిర్మితమైందని... మన పథకాలు కూడా అదే సూత్రాన్ని ఆధారం చేసుకుని ఉంటాయని చెప్పారు. కొంతమంది దేశంలోని ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చేతనైతే, బీఫ్ ఎగుమతులను నిషేధించడానికి అందరి మద్దతునూ కూడగట్టండి అని సూచించారు. ఇంకో విషయం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్ లో గోవధ నేరం!

  • Loading...

More Telugu News