: బతుకమ్మ పండుగకు రూ.10 కోట్లు కేటాయించడం సరికాదు: టి.కాంగ్రెస్


బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించడంపై టి.కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు రైతులు, ఆశావర్కర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బతుకమ్మ పండుగకు రూ.10 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. గతేడాది కూడా ఈ పండుగకు ఇంతే మొత్తాన్ని కేటాయించారని, అప్పుడదంతా ఎంపీ కవిత కార్యక్రమాల కోసమే ఖర్చు చేశారని ఆరోపించారు. కాబట్టి ఈసారి కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి కానీ, జాగృతి సంస్థ దత్తత తీసుకోవడం ఏమిటని శారద ప్రశ్నించారు. అన్నదాతలు అనాధలని జాగృతి సంస్థ భావించడం సరికాదని సూచించారు.

  • Loading...

More Telugu News