: అదితి మరణంపై కోర్టులో వ్యాజ్యం వేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
విశాఖ డ్రైనేజీలో పడి కొట్టుకుపోయి ఎక్కడో శవమై తేలిన చిన్నారి అదితి మరణంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడుతున్నారు. అదితి దుర్మరణంపై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేస్తానని చెప్పారు. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో బాటు, ఆక్రమణదారులు చిన్నారిని పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. మరోవైపు ఈ బాలిక మరణంపై పలువురు రాజకీయ నేతలతో బాటు, ప్రజాసంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ అదితికి పోస్టుమార్టు చేశాక ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి విశాఖ మద్దిలపాలెం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.