: 88వేల డాలర్లకు అమ్ముడుపోయిన టైటానిక్ లంచ్ మెనుకార్డ్


టైటానిక్ ఓడ చివరి లంచ్ మెనుకార్డు వేలంపాటలో అమ్ముడుపోయింది. ఆన్ లైన్ వేలంలో 88వేల డాలర్లకు ఓ ప్రైవేటు వ్యక్తి దక్కించుకున్నట్లు వేలం పాట నిర్వాహకులు తెలిపారు. అనుకున్న విధంగానే వేలంలో మెనుకార్డుకు ధర లభించిందని వేలం నిర్వహక సంస్థ 'లయన్ హార్ట్ ఆటోగ్రాఫ్స్' తెలిపింది. ఓడలోని మొదటి తరగతి ప్రయాణికుల కోసం ఆ మెనుకార్డును సిద్ధం చేశారట. 1912, ఏప్రిల్ 14 తేదీతో ఉన్న మెనుకార్డు షిప్ నిర్మాణ సంస్థ వైట్ స్టార్ లైన్ లోగోను కలిగి ఉంది. నాటి టైటానిక్ ఓడ ఘటనలో లైఫ్ బోట్ ద్వారా బయటపడిన అబ్రహాం లింకన్ సాలమన్ అనే ప్రయాణికుడు మెనుకార్డును భద్రపరిచాడు. అతని వారసుడే గుర్తు తెలియని వ్యక్తి ద్వారా కార్డును వేలానికి ఉంచినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News