: ఖైరతాబాద్ ‘లడ్డూ’ను అమ్ముకున్నారు... మీడియాను చూసి పరుగు లంకించుకున్న వైనం


భారీ వినాయకుడు ఖైరతాబాదు గణేశుడి ప్రసాదం కోసం ఓ వైపు లాఠీ దెబ్బలకూ వెరవని భక్తులు భారీ క్యూ లైన్లలో తెల్లవారుజాము నుంచి పడిగాపులు పడుతున్నారు. మరోవైపు గణేశ్ ఉత్సవ సమితికి చెందిన కొంత మంది ప్రతినిధులు మాత్రం ‘లడ్డూ’ను విక్రయించి సొమ్ము చేసుకునేందుకు యత్నించారు. తీరా ఈ తతంగాన్ని మీడియా పసిగట్టి అక్కడి వెళ్లడంతో సదరు ప్రతినిధులు పరారయ్యారు. వివరాల్లోకెళితే... ఖైరతాబాదు వినాయకుడి చేతిలో పెట్టేందుకు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేేత పోలిశెట్టి మల్లిబాబు 5,600 కిలోల భారీ లడ్డూను తయారు చేశారు. వినాయక నిమజ్జనం తర్వాత భద్రపరచిన లడ్డూను నేడు భక్తులకు పంచేందుకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది. అయితే లడ్డూలో కొంత భాగాన్ని తాపేశ్వరంలోని తయారీదారులు, భక్తులకు చేరవేసేందుకు ఓ లారీలో తరలించారు. మార్గమధ్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో లారీని నిలిపిన ప్రతినిధులు అక్కడి భక్తులకు లడ్డూను విక్రయించడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడాన్ని గమనించిన సదరు ప్రతినిధులు పరారయ్యారు.

  • Loading...

More Telugu News