: టీఎస్ కేబినెట్ లో మార్పులు చేయనున్న కేసీఆర్... ప్రస్తుత మంత్రుల్లో అలజడి?


తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగియగానే, మంత్రివర్గం ప్రక్షాళన మొదలవుతుందని సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. కేబినెట్ లో ఇంతవరకు ఓ మహిళకు కూడా స్థానం లేకపోవడం విమర్శలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, కేబినెట్ లోకి మహిళలను తీసుకోనున్నారని, దీంతోపాటు వివిధ సామాజిక వర్గాలకు కూడా చోటు కల్పించనున్నారని చర్చలు జరుగుతున్నాయి. గవర్నర్ తో కేసీఆర్ వరుస భేటీలు కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా గవర్నర్ తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. మంత్రివర్గ ప్రక్షాళన వార్తలతో ప్రస్తుత మంత్రుల్లో అలజడి మొదలైంది.

  • Loading...

More Telugu News