: చపాతీలు గుండ్రంగా చేయలేదని చంపిపడేశారు


చపాతీలు గుండ్రంగా చేయలేదనే కారణంతో కన్న కూతురినే చంపేశాడు ఓ కసాయి. దీని కోసం తన కుమారుడి సాయం కూడా తీసుకున్నాడు. ఈ దారుణం పాకిస్థాన్ ఇస్లామాబాద్ లోని అజీమ్ పార్క్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అనీఖా అనే 13 ఏళ్ల చిన్నారి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. వారిద్దరూ అనీఖాను కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయింది. దీంతో, ఆమె మృతదేహాన్ని పొలాల్లో పారేసి వారు వెళ్లిపోయారు. అనీఖాను తామిద్దరం తీవ్రంగా కొట్టామని తండ్రీకొడుకులు ఇద్దరూ పోలీసు విచారణలో ఒప్పుకున్నారు.

  • Loading...

More Telugu News