: రాజ్ భవన్ కు వెళ్లనున్న కేసీఆర్... నేడు మరోమారు గవర్నర్ తో భేటీ
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు మరోమారు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఆయన మరికాసేపట్లో రాజ్ భవన్ వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిన్నటికి నిన్న రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్ గవర్నర్ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల తీరు, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తదితరాలు నిన్నటి వారి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అంతేకాక కేంద్రం నుంచి ఏపీకి కోట్లాది నిధులు తరలివస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటని కూడా కేసీఆర్ గవర్నర్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా నేడు వరుసగా రెండో రోజు కేసీఆర్ గవర్నర్ తో భేటీకి సిద్ధమవుతుండటంపై ఆసక్తికర చర్చకు తెరలేచింది.