: గాంధీ స్ఫూర్తితో అందరూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు కృషి చేయాలి: చంద్రబాబు
మహాత్ముడి స్ఫూర్తితో అందరూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు పాటుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. నెలలో ఒక్కరోజు స్వచ్ఛ కార్యక్రమానికి కేటాయించాలన్నారు. గుంటూరులో జరిగిన గాంధీ జయంతిలో పాల్గొన్న బాబు, జిన్నా టవర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చొరవ చూపాలన్నారు. అనంతరం గాంధీ విగ్రహం నుంచి పోలీసు గ్రౌండ్స్ వరకు సీఎం చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న సందేశంతో పాదయాత్ర చేస్తున్నారు.