: రాజమండ్రిలో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు


ఏపీ కాంగ్రెస్ నేతలు రాజమండ్రిలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ దీక్షలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, పనబాక లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. నేడు గాంధీ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలంతా తెల్ల టోపీలు ధరించి రాట్నాలు పెట్టుకుని దీక్షలో కూర్చున్నారు. విభజన చట్టంలో ఏపీకి నాడు యూపీఏ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చిందని, వాటన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై మాట మార్చరాదని రఘువీరా చెప్పారు. అన్ని జిల్లాలలో కూడా గాంధీ విగ్రహల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక హోదా డిమాండుతో దీక్ష చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News