: ఏపీలో 'విపాసన' ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న నటి అమల


ఆంధ్రప్రదేశ్ లో 'విపాసన' ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఆలోచన చేస్తోంది. ఈ మేరకు నాగార్జున కొండ, విశాఖపట్నంలో బౌద్ధ సర్క్యూట్ లో విపాసన కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటోంది. కేంద్రాల ఏర్పాటుకు సినీ నటి అక్కినేని అమల ముందుకొచ్చి పర్యాటక అధికారులతో చర్చలు జరిపారు. బుద్ధుడు విపాసన ధ్యాన మార్గాన్ని ఎంచుకునే రుజుమార్గంలో పయనించారని బౌద్ధులు నమ్ముతుంటారు. భారతదేశంలోనే ఈ ధ్యానం పుట్టినప్పటికీ విదేశాల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. 10 రోజుల పాటు ఉండే ఈ ధ్యాన శిక్షణకు విదేశాల్లో అయితే లక్షల్లో ఖర్చవుతుంది. అయితే ఈ పద్ధతిని 12 ఏళ్ల కిందటే నటి అమల నేర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు ఆమె ఇంటి వద్దే తనకు తెలిసిన వారికి ధ్యానంలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడీ ధ్యాన కేంద్రాలను ఏపీలో ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని అమల భావిస్తున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అమల తెలిపారు.

  • Loading...

More Telugu News