: హుస్సేన్ సాగర్ తీరాన దేశంలోనే అతిపెద్ద టవర్ నిర్మాణం!


హైదరాబాద్ నడిబొడ్డున, సుందర హుస్సేన్ సాగర్ ఒడ్డున దేశంలోనే అతిపెద్ద సిగ్నేచర్ టవర్ ను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలను నిర్మించాలని గతంలో నిర్ణయించినప్పటికీ... అది కార్యరూపం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో, కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ టవర్ హైదరాబాద్ కీర్తి కిరీటంలో ఒక కలికితురాయిలా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. టూరిజం పరంగా తెలంగాణకు ఓ గుర్తింపు తీసుకువచ్చేలా ఈ టవర్ ఉండబోతోంది. ఓ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు, బాలానగర్ వద్ద ఓ ఫ్లైఓవర్, సికింద్రాబాద్-హకీంపేట మధ్య ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని కూడా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News