: టీడీపీని చైనా కమ్యూనిస్ట్ పార్టీతో పోల్చిన జూపూడి
తెలుగుదేశం పార్టీని చైనాలోని కమ్యూనిస్టు పార్టీతో పోల్చారు ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. టీడీపీ కొత్త కమిటీల గురించి మాట్లాడుతూ, చైనా కమ్యూనిస్టు పార్టీని రూపొందించినంత గొప్పగా టీడీపీ కమిటీలను ఏర్పాటు చేశారని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సమతూకాన్ని పాటించారని అన్నారు. ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక న్యాయాన్ని ప్రతిబింబింపజేశారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ తగిన గౌరవం లభిస్తుందని చంద్రబాబు మరోసారి నిరూపించారని తెలిపారు.