: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కండువా కోసం అయిన ఖర్చెంతో తెలుసా?


అచ్చ తెలుగు వస్త్రధారణకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టింది పేరు. ఇక పొరుగు రాష్ట్రం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా సంప్రదాయ వస్త్రధారణలోనే కనిపిస్తారు. తెల్లటి పంచె, అదే రంగులో చొక్కాతో పాటు ఆయన ఎడమ భుజంపై ఓ కండువా కనిపిస్తుంది. కండువా లేకుండా సిద్ధరామయ్య కనిపించిన దాఖలాలే లేవు. అత్యంత సాదాసీదాగా కనిపించే ఆ కండువా కోసం గడచిన ఆరు నెలల్లో (ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి) కర్ణాటక ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా? అక్షరాలా రూ.4.78 లక్షలట. కండువాతో పాటు చేతి రుమాళ్లు, ముఖం తుడుచుకునే టవళ్లు కూడా ఈ ఖర్చులోనే కొనుగోలు చేశారట. ఇక సీఎం అధికారిక నివాసంలో దుప్పట్లు, బెడ్ షీట్ల కోసం ఆ ప్రభుత్వం మరో రూ.4.79 లక్షలను వెచ్చించింది. వెరసి కండువా, టవళ్లు, దుప్పట్ల కోసమే కర్ణాటక ప్రభుత్వం ఆరు నెలల్లోనే 9.57 లక్షలను ఖర్చు చేసిందన్న మాట. కన్నడ నాట ఓ సమాచార హక్కు ఉద్యమకారుడి దరఖాస్తుకు ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.

  • Loading...

More Telugu News