: 29న భజ్జీ పెళ్లి... కలర్ ఫుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ!
టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివాహం ఈ నెల 29న జరగనుంది. సుదీర్ఘకాలంగా ప్రేమాయణం సాగిస్తన్న బాలీవుడ్ నటి గీతా బస్రాను అతడు సంప్రదాయబద్ధంగా పెళ్లాడనున్నాడు. ఇందుకోసం అతిథులను ఆహ్వానించేందుకు భజ్జీ ఫ్యామిలీ కలర్ ఫుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్లను సిద్ధం చేసింది. ఐదు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా భజ్జీ వివాహ వేడుక జరగనుంది. నవంబర్ 1న ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్ లో కొత్త జంట గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తోంది.