: 2017 జూన్ 2 నాటికి వచ్చేస్తేనే ‘ఏపీ స్థానికత’... ఏపీ కేబినెట్ నిర్ణయం
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదు తెలంగాణ రాజధానిగా మారింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగినా, ఆ తర్వాత హైదరాబాదును వీడాల్సిందే కదా అన్న భావనతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వేగిరం చేశారు. అదే సమయంలో తెలంగాణలో ఉంటున్న ఎపీకి చెందిన ప్రజలు, ఉద్యోగుల స్థానికతపై వస్తున్న ప్రశ్నలకు నిన్నటి కేబినెట్ భేటీ స్పష్టమైన సమాధానం చెప్పింది. 2017 జూన్ 2 నాటికి ఏపీకి తిరిగి వచ్చే వారికందరికి ‘ఏపీ స్థానికత’ వర్తిస్తుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు నిన్నటి కేబినెట్ భేటీ కీలక నిర్ణయం తీసుకుంది.