: సఫారీలతో సిరీస్ నేటి నుంచే... ధర్మశాలలో తొలి టీ20కి టీమిండియా రెడీ!
దాదాపు 72 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనున్న ‘ఫ్రీడమ్ సిరీస్’ నేటి నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య కొనసాగనున్న ఈ సిరీస్ నేటి రాత్రి ధర్మశాల వేదికగా జరుగనున్న టీ20 మ్యాచ్ తో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్న ఇరు జట్లు మ్యాచ్ కోసం సర్వసన్నద్ధంగా ఉన్నాయి. కొత్తగా ప్రారంభమైన ఈ సిరీస్ లో ఈ ఏడాది మూడు టీ20 మ్యాచ్ లు, ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లోనే విజయంతో సిరీస్ పై పట్టు సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మేరకు పకడ్బందీ ప్రణాళికతో మ్యాచ్ కు సిద్ధమయ్యాయి.