: అరసవెల్లిలో రెండో రోజూ అద్భుతం సాక్షాత్కారం... పోటెత్తిన భక్తజనం
శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వరుసగా రెండో రోజూ అద్భుతం సాక్షాత్కరించింది. అరసవెల్లి సూర్యనారాయణుడి మూల విరాట్ ను భానుడి కిరణాలు ముద్దాడాయి. నేటి ఉదయం దాదాపు ఐదు నిమిషాల పాటు సూర్య కిరణాలు మూల విరాట్ పాదాలను తాకాయి. నిన్న ఉదయం సూర్య కిరణాలు మూల విరాట్ ను తాకిన సంగతి తెలిసిందే. అయితే నేడు, రేపు కూడా సూర్య కిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అవకాశాలున్నాయని వేద పండితులు నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి ఉదయం అరసవెల్లి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. ఏడాదిలో రెండు సార్లు మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించి భక్తులు పరవశం చెందారు.