: అఫ్ఘాన్ లో కూలిన సైనిక విమానం... ఆరుగురు అమెరికా సైనికులు సహా 11 మంది దుర్మరణం


ఒరేగాన్ కళాశాలలో ఉన్మాది జరిపిన కాల్పుల షాక్ నుంచి తేరుకోకముందే, అమెరికాకు మరో షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన సైనిక విమానం ఒకటి కుప్పకూలింది. అఫ్ఘానిస్థాన్ లోని జలాలాబాదులో ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఆరుగురు అమెరికా సైనికులున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు వెల్లడి కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News