: అమెరికా కాలేజీలో మరోసారి తుపాకుల గర్జన...ఒరేగాన్ లో కాల్పులు, 13 మంది మృతి


అమెరికాలో మరోమారు తుపాకీ గర్జనలు ఆ దేశాన్ని వణికించాయి. నాలుగు తుపాకులు చేతబట్టిన ఓ దుండగుడు నేరుగా ఒరేగాన్ కమ్యూనిటీ కళాశాలలోకి చొరబడ్డాడు. వచ్చీ రావడంతోనే వెంట తెచ్చుకున్న తుపాకులతో ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 13 మంది మరణించగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ దుర్మార్గుడు కూడా హతమయ్యాడు. వివరాల్లోకెళితే... అమెరికాలో నేటి ఉదయం కళాశాల తరగతులు ప్రారంభం కాగానే 10.38 గంటలకు తుపాకులతో చొచ్చుకువచ్చిన 20 ఏళ్ల వయసున్న దుండగుడు యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 13 మందికి పైగా అక్కడికక్కడే చనిపోయారు. 20 మంది గాయాలపాలయ్యారు. అయితే మృతులు, క్షతగాత్రులపై స్పష్టమైన సమాచారం లేదు. కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దుండగుడిని నిలువరించే యత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు చనిపోయాడు. అతడు ఎవరనే విషయం ఇంకా తేలలేదు. అంతేకాక ఏ ఉద్దేశంతో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడన్న విషయమూ వెల్లడి కాలేదు. తాజా కాల్పులతో అమెరికాలో భయాందోళనలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News