: ఈ వీడియో గేమ్ కు మంచి రేటింగ్!
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సింగ్ ఈజ్ బ్లింగ్'. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. కాగా, ఈ సినిమా కథాంశంతోనే రూపొందించిన ఓ వీడియో గేమ్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్ రేటింగ్స్ లో ఈ వీడియో గేమ్ కు రేటింగ్ బాగా లభిస్తోంది. అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, లారా దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కోసం ప్రేక్షకుల ఎదురుచూపులకు రేపటితో తెరపడనుంది.