: ఎన్డీయే విజన్ డాక్యుమెంటుకు షాకిచ్చిన మహాకూటమి!


సాంకేతిక పరిజ్ఞానాన్ని, సోషల్ మీడియాను వాడుకోవడంలో బీజేపీని మించినది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, సోషల్ మీడియా వేదికగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని నెటిజన్లు ఇప్పటికీ వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి బీజేపీకి బీహార్ లో మహాకూటమి షాకిచ్చింది. ఈ మధ్యాహ్నం పాట్నాలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బీహార్ ఎన్నికల విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన గంటలోపే మహాకూటమి పది నిమిషాల నిడివి గలిగిన వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వివిధ సభల్లో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేపడుతున్న విధానాల గురించిన వ్యాఖ్యలు ఉన్నాయి. బీజేపీ హామీలు మాత్రమే ఇస్తుందని, అధికారం వచ్చాక వాటిని గాలికి వదిలేస్తుందంటూ మహాకూటమి ఎదురుదాడి ప్రారంభించింది. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News